![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1003 లో.. శైలంద్ర అతడి ఫైనాన్సియర్స్ ని మను కలుస్తాడు. శైలేంద్ర దగ్గర నుండి యాభై కోట్ల చెక్కుని తీసుకొని చింపేస్తాడు. మాకు ఇవ్వాలిసిన అప్పు ఇవ్వలేదని కోర్ట్ కి వెళ్తామని ఫైనాన్సియర్స్ అంటారు. వెళ్ళండి అసలు మీరు అప్పే ఇవ్వలేదని వెరిఫికేషన్ లో తేలిందని మను అంటాడు. నువ్ వాళ్ళకి యాభై కోట్లు ఇచ్చావన్న భ్రమలో ఉన్నారు, నువ్వు చెక్కు చింపేశావని వాళ్ళకి చెప్తానని శైలేంద్ర అంటాడు. నేను కూడా మీరు ఫ్రాడ్ అని చెప్తానని మను అంటాడు.
ఇక నుండి ఆ కాలేజీనీ నేను కాపాడతానని శైలేంద్రతో మను ఛాలెంజ్ చేస్తాడు. దాంతో మళ్ళీ శైలంద్రలో టెన్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత శైలేంద్ర కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ తో రిషి ఫోటో దగ్గర సంతాపం ప్రకటిస్తు ఉంటారు. రిషి ఫోటోకి దండ వేయబోతుంటే అప్పుడే వసుధార వచ్చి ఆగమని చెప్తుంది. రిషి సర్ బ్రతికే ఉన్నారు. మీరు ఆలా చేయకండి అని వసుధార చెప్తుంది. అయిన వినకుండా రిషి ఫోటోకి దండ వెయ్యబోతుంటే మను వచ్చి ఆపుతాడు. మీరు రిషి సర్ భార్యని బాధపెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని స్టూడెంట్స్ కి సర్ది చెప్పి పంపిస్తాడు.
మీకు క్యాబిన్ రెడీ చేసానని మను పీఏ వచ్చి చెప్పగానే.. క్యాబిన్ ఏంటని అందరు ఆశ్చర్యపోతారు. అతను మనకి హెల్ప్ చేసినప్పుడే ఏదో ఉందని అనుకున్నాను.. నా పర్మిషన్ లేకుండా క్యాబిన్ ఏంటని అనుపమ, మహేంద్రలతో వసుధార అంటుంది. ఆ తర్వాత బోర్డు మీటింగ్ అరెంజ్ చేస్తారు. మినిస్టర్ అటెండ్ అవుతాడు. మను కూడా ఈ కాలేజీలో ఒక బోర్డు మెంబెర్ గా ఉండాలని అనుకుంటున్నాడని మినిస్టర్ అంటాడు. కాలేజీకి ప్రాబ్లమ్ క్రియేట్ చేసే వాళ్ళున్నారని ఈ కాలేజీనీ కాపాడడం కోసం ఇలా ఉంటానని మను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |